హిజాబ్ ధరించిన యువతితో ఉన్నాడని యువకుడిపై దాడి

by Shiva |   ( Updated:2023-06-01 07:59:44.0  )
హిజాబ్ ధరించిన యువతితో ఉన్నాడని యువకుడిపై దాడి
X

దిశ, నిజామాబాద్ క్రైం: రైల్వేస్టేషన్ లో రైలు దిగి ఆటోలో వెళ్తున్న ఇద్దరు యువకులు, యువతీ ఉండడాన్ని గమనించి ఇద్దరు యువకులు ఒక యువకుడిపై దాడి చేసి అతని వద్ద నుంచి సెల్ ఫోన్, ఇతర వస్తువులు అపహరించారు. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున రైల్వేస్టేషన్ రోడ్డులో జరిగింది. పోలీసులు యువకుడిపై దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. నిజామాబాద్ 1వ టౌన్ ఎస్ హెచ్ వో విజయబాబు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలో వెటర్నరి డాక్టర్‌లుగా శిక్షణ పొందుతున్న ఇద్దరు యువకులు ఒక యువతి ఈ నెల 30న రాత్రి మహారాష్ట్ర రైలులో నిజామాబాద్ కు చేరుకున్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ కు ఆటోలో వెళ్తుండగా నగరంలోని మహ్మదీయ కాలనీకి చెందిన మహమ్మద్ అదిల్, పులాంగ్ కు చెందిన షేక్ మొయినుద్దీన్‌లు వారిని అటకాయించారు.

ముసుగు ధరించిన యువతి ఎవ్వరు అమేను ఎటు తీసుకువేలుతున్నావని ప్రశ్నించారు. తాము ముగ్గురం మహారాష్ట్రలో వెటర్నరీ వైద్యులుగా శిక్షణ పొందుతున్న విద్యార్థులమని తమ సొంత ఊరికి వెళ్లేందుకు ఆటోలో కలిసి వేలుతున్నామని చెప్పడంతో అందులో ఒక యువకుడి నీ బయటకు లాగి చితకబాదారు. అక్కడి నుంచి బస్టాండ్ వరకు బైక్ పై వెంబడించి అక్కడ ప్లాట్ పాం 2 వద్ద యువకుడిని తీవ్రంగా చితక బాదారు. అతని వద్ద నుంచి సెల్ ఫోన్ లాక్కుని పరారీ అయ్యారు. బుధవారం ఉదయం బాదితుడు 1వ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి రైల్వే స్టేషన్ ప్రాంతంలో తిరుగుతున్న మహమ్మద్ అదిల్, షేక్ మొయినుద్దీన్‌లను అరెస్టు చేసినట్లు ఎస్ హెచ్ ఓ విజయ్ బాబు తెలిపారు.

Advertisement

Next Story