సమ్మక్క సాగర్ బ్యారేజ్ నీటిలో మునిగి యువకుడు మృతి...

by Sumithra |   ( Updated:2023-05-27 16:51:40.0  )
సమ్మక్క సాగర్ బ్యారేజ్ నీటిలో మునిగి యువకుడు మృతి...
X

దిశ, కన్నాయిగూడెం : కన్నాయిగూడెం మండలంలోని రాజన్నపేట గ్రామానికి చెందిన యువకుడు చేపల వేటకు వెళ్లి గోదావరిలో మునిగి మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాజన్నపేట గ్రామానికి చెందిన తూరం రామక్రిష్ణ (23) గ్రామస్తులతో కలిసి తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజ్ కి చేపల వేటకు వెళ్లాడన్నారు.

అందరితో పాటు తాను కూడా చేపలు పడుతున్న క్రమంలో నీట మునిగి ఈత రాకపోవడంతో గోదావరిలో గల్లంతయ్యాడన్నారు. స్థానికులు ఎస్సై సురేష్ కు సమాచారం అందించగా గజ ఇతగాళ్ల సహాయంతో గోదావరిలో నీటమునిగిన యువకుడిని గాలించి వెలికి తీశారు. కాగా అప్పటికే యువకుడు మృతిచెందాడని నిర్ధారించారు. మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమ్మితం ఏటూరునాగారం సామజిక అస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story