విద్యుత్ షాక్ తో యువకుడి మృతి

by Shiva |
విద్యుత్ షాక్ తో యువకుడి మృతి
X

దిశ, మంథని : విద్యుత్ షాక్ తో ఓ యువకుడు మృతి చెందిన ఘటన మథని పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రచ్చపల్లి గ్రామానికి చెందిన కుమార స్వామి అనే యువకుడు పట్టణంలోని ఓ సర్వీసింగ్ సెంటర్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే హార్వెస్టర్ కడుగుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ గురై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

Advertisement

Next Story