రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం..

by Kalyani |
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం..
X

దిశ, గోపాలపేట: వనపర్తి జిల్లా గోపాలపేట మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కోడేరు మండలం జనంపల్లి గ్రామానికి చెందిన బాసారం శేఖర్ గ్రామం నుంచి గోపాలపేట వైపు వెళ్తుండగా అదే సమయంలో ట్రాక్టర్ అటువైపు నుంచి వచ్చి బైకును ఢీ కొట్టింది.

ఈ సంఘటనలో బైకు నడుపుతున్న శేఖర్ కింద పడిపోయాడు. శేఖర్ తలపై నుంచి ట్రాక్టర్ ట్రాలీ వెళ్లడంతో శేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనపై ఎస్సై వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story