చెట్టుకు ఉరేసుకొని యువకుడు మృతి..

by Kalyani |   ( Updated:2023-05-27 23:45:22.0  )
చెట్టుకు ఉరేసుకొని యువకుడు మృతి..
X

దిశ, మర్పల్లి: చెట్టుకు ఉరేసుకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మోమిన్ పేట్ మండల పరిధిలోని చంద్రాన్ పల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మోమిన్ పేట్ మండలం చంద్రాన్ పల్లి గ్రామానికి చెందిన పంచలింగాల అడివయ్యా (24) ముస్లిం స్మశాన వాటికలో చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు. అడివయ్యా మద్యం సేవించి వచ్చి భార్యను హింసింస్తూ కొడుతుండేవాడు. దీంతో వారం రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లింది. కాగా శనివారం ఉదయం అడివయ్యా అత్తగారింటికి వెళ్లి భార్యను కాపురానికి రామ్మని కోరాడు.

అందుకు భార్య తల్లి మీ తల్లిదండ్రులను తీసుకొస్తేనే తన కూతురిని కాపురానికి పంపిస్తానని చెప్పడంతో అడివయ్యా అక్కడినుంచి వెళ్లిపోయాడు. తరువాత భార్య అడివయ్యాను వెతికే క్రమంలో ముస్లిం స్మశాన వాటికలో చెట్టుకు ఉరేసుకొని చనిపోయినాడు. తన భర్త మరణంపై ఎవరిపై ఎలాంటి అనుమానం లేదని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story