ఈతకు వెళ్లి యువకుడి మృతి

by Shiva |
ఈతకు వెళ్లి యువకుడి మృతి
X

దిశ, కమ్మర్ పల్లి : సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఓ యువకుడు మృతి చెందిన ఘటన శనివారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చౌట్ పల్లి గ్రామానికి చెందిన గడ్డం ధర్మేందర్ కుమారుడు గడ్డం రేవంత్(18) ఇటీవలే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాశాడు. సుమారు పది మంది స్నేహితులతో కలిసి స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు హాజరైన రేవంత్ సరదాగా వాళ్లతో గడిపాడు.

ఈతకు వెళదాం అని తోటి స్నేహితులు అనడంతో అమీర్ నగర్ గ్రామ శివారులోని వ్యవసాయ భూమిలో ఉన్న బావి వద్దకు వెళ్లారు. రేవంత్ కి ఈత రాకపోవడంతో ఒడ్డు మీద నిలబడి స్నానం చేశాడు. స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. కాపాడేందుకు తోటి స్నేహితులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. రేవంత్ తల్లిదండ్రల రోదనకి స్థానికులచే కన్నీళ్లు పెట్టించాయి. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించామని కమ్మర్ పల్లి ఎస్సై రాజశేఖర్ తెలిపారు.

Advertisement

Next Story