పురుగుల మందు తాగి యువకుడి మృతి..

by Kalyani |
పురుగుల మందు తాగి యువకుడి మృతి..
X

దిశ, చిన్నంబావి: పురుగుల మందు తాగి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని కొప్పునూరు గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొప్పునూరు గ్రామానికి చెందిన సాయికుమార్ (23), ఇటీవల అనారోగ్యానికి గురికావడం తో తీవ్ర మనస్తాపనికి గురై బుధవారం పురుగుల మందు తాగాడు.

ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో శనివారం మృతి చెందాడు. దీంతో యువకుడి తల్లి దండ్రులు నరసింహ, లక్ష్మిదేవమ్మా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

Next Story