శివగంగా కోనేరులో దూకి యువకుడు ఆత్మహత్య..

by Kalyani |   ( Updated:2023-05-27 23:35:34.0  )
శివగంగా కోనేరులో దూకి యువకుడు ఆత్మహత్య..
X

దిశ, మహేశ్వరం: అనారోగ్యంతో బాధపడుతన్న ఓ యువకుడు మనస్థాపానికి గురై శివగంగ ఆలయ కోనేరులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని శివగంగ ఆలయంలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కందుకూరు మండలం సరస్వతి గూడ గ్రామానికి చెందిన మామిళ్ల యాదయ్య (30) శనివారం మహేశ్వరం మండల కేంద్రంలోని శివగంగ ఆలయానికి వచ్చాడు.

తన మేనబావకు మధ్యాహ్నం 12 గంటలకు ఫోన్ చేసి నేను చనిపోతున్నాను అని సమాచారం అందించి శివగంగ ఆలయ కోనేరులో యాదయ్య దూకాడు. వెంటనే యాదయ్య కుటుంబసభ్యులు శివగంగ ఆలయానికి చేరుకొని చూడగా అప్పటికే యాదయ్య చనిపోయాడు. మృతుడి తల్లి మామిళ్ల పెంటమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story