రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య..

by Sumithra |
రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య..
X

దిశ, వలిగొండ : రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని నాగారం - గొల్లేపల్లి గ్రామాల గుండా వెల్లె రైలు మార్గంలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే నాగారం గేటు సమీపం 32/4 పిల్లర్ వద్ద గొల్లేపల్లి గ్రామానికి చెందిన నామ పృథ్వి (22) రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మృతుడు విజయ డైరీలో పనిచేస్తున్నాడు మృతునికి తల్లి, అన్న ఉన్నారు. తండ్రి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు. కాగా తండ్రి వైద్య ఖర్చులకు అప్పుచేయడంతో ఆర్థిక ఇబ్బందులు తాలలేక, మరోవైపు తండ్రి మృతి చెందగా మానసిక క్షోభకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే సీఐ పవన్ అగ్రిల్ తెలిపారు.

Advertisement

Next Story