పైనంపల్లిలో యువకుడు ఆత్మహత్య?

by Mahesh |
పైనంపల్లిలో యువకుడు ఆత్మహత్య?
X

దిశ, నేలకొండపల్లి: ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. శనివారం ఉదయం కుటుంబ కలహాలతో గురుస్వామి (20) అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న నేలకొండపల్లి ఎస్సై స్రవంతి ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్య, ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story