రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

by Shiva |
రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
X

దిశ, చేగుంట : రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వడియారం గ్రామ శివారులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వడియారం గ్రామానికి చెందిన గుండ్ల బాబు (26) స్థానికంగా ఉన్న ట్రాక్టర్ షోరూంలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవలే అతడి భార్యకు మృత శిశువు జన్మించింది. కుటుంబ సభ్యులకు తాను చనిపోతున్నానంటూ ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిన బాబు భూసారెడ్డికుంట సమీపంలో వేగంగా వస్తున్న రైలు ఎదురెళ్లి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కామారెడ్డి రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story