చెల్లెలు తల నరికిన అన్న.. విషయం తెలిస్తే షాకవడం ఖాయం

by Javid Pasha |
చెల్లెలు తల నరికిన అన్న.. విషయం తెలిస్తే షాకవడం ఖాయం
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బారాబంకిలో దారుణం జరిగింది. సొంత చెల్లె తలను నరికాడు ఓ యువకుడు. అనంతరం ఆ తలను తీసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. అసలు ఏం జరిగిందంటే.. బారాబంకిలోని ఫతేపూర్ ఏరియా మిత్వారా గ్రామానికి చెందిన ఆషిఫా (18) అనే యువతి అదే గ్రామానికి చెందిన చందూబాబు అనే యువకుడిని ప్రేమించింది. అయితే మతాలు వేరు కావడంతో యువతి కుటుంబ సభ్యలు వారి వివాహానికి నో చెప్పారు. ఈ క్రమంలోనే వారిద్దరూ లేచిపోయారు. విషయం తెలుసుకున్న యువతి సోదరుడు రియాజ్ (22) ఆ యువకుడిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇక యువతిని కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. అయితే ఈ విషయమై అన్నాచెల్లెల్ల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తాజాగా ఆషిఫా, రియాజ్ మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తైడైన రియాజ్ పెద్ద కత్తి తీసుకొని ఆషిఫా మెడ తల నరికాడు. అనంతరం ఆ తలను తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడని ఏఎస్పీ అషుతోష్ మిశ్రా తెలిపారు.

Advertisement

Next Story