వరుడి వెకిలి చేష్టలు.. తట్టుకోలేక షాకిచ్చిన వధువు

by sudharani |   ( Updated:2023-05-08 13:44:55.0  )
వరుడి వెకిలి చేష్టలు.. తట్టుకోలేక షాకిచ్చిన వధువు
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో చాలా పెళ్లిళ్లు పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోతున్నాయి. చిన్నచిన్న కారణాలకు తాళికట్టే సమయంలో వధువు, వరులు పెళ్లిళ్లు క్యాన్సిల్ చేసుకుంటూ అందరికీ షాక్‌ ఇస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. భాజభజంత్రీల మధ్య ఘనంగా జరగాల్సిన పెళ్లి.. వరుడి అత్యుత్సాహంతో పెటాకులు అయ్యింది. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మీర్ణాపూర్ జిల్లా మాణిక్ పూర్ ప్రాంతానికి చెందిన యువతికి ఓ వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. ముహుర్తం సమయం దగ్గర పడటంతో ఇళ్లంతా పెళ్లి వాతావరణం నెలకొంది. భాజాభజంత్రీలతో పెళ్లి మండపం సందడిగా మారిపోయింది. కొంచెం సేపటిలో తాళి కట్టే ముహూర్తం ఉండగా.. వరుడు ఫుల్‌గా తాగి వచ్చాడు. మొదట వధువు పట్టించుకోలేదు. కానీ, వరుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. వధువుపై సింధూరం జల్లడం మొదలు పెట్టాడు.

ఫుల్‌గా తాగడమే కాకుండా.. కనీసం బొట్టు పెట్టే పరిస్థితుల్లో కూడా వరుడు లేకపోవడం వధువు తట్టుకోలేక పోయింది. అంతే కాకుండా వెకిలిగా తనపై సింధూరం జల్లడాన్ని తట్టుకోలేక వెంటనే ఈ పెళ్లి నాకు వద్దు అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. వధువు మాటలకు మొదట అందరూ షాక్ అయ్యారు. అనంతరం ఇరు కుటుంబ సభ్యులు పెళ్లి క్యాన్సిల్ చేసుకుని పోలీసు ఆశ్రయించగా.. పెళ్లిలో భాగంగా ఇచ్చిన కట్న కానుకలు తిరిగి ఇచ్చేందుకు వరుడు కుటుంబసభ్యులు అంగీకరించారు. ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story