- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పనిచేస్తున్న ఇంట్లోనే పనిమనిషి చోరి..
దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో ఆదివారం జరిగిన చోరిని 24 గంటల్లోనే ఛేదించినట్లు నిజామాబాద్ నగర సీఐ.వెంకటనారాయణ తెలిపారు. సోమవారం 3వ టౌన్ పోలీస్ స్టేసన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. సుభాష్ నగర్ కు చెందిన చింతలపుడి రాధా అనే మహిళ ఇంట్లో గౌతంనగర్ కు చెందిన దేవకతే రాజమణి అలియాస్ రాధా ఇటీవల పనిమనిషిగా చేరింది. ఆదివారం ఇంటిపని చేసి సాయంత్రం ఇంటికి వెళ్లిపోయింది.
ఇంటి యజమాని రాధా తన బెడ్ రూంలో బంగారు నగల డబ్బాలో ఒక బంగారు నెక్లెస్, బంగారు నల్లపూసల దండ, రెండు జతల బంగారు కమ్మలు కనిపించలేదని తన ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషి పై అనుమానం ఉందని 3వ టౌన పోలీసులకు ఫిర్యాదు చేసింది. 3వ టౌన్ ఎస్సై లక్ష్మయ్య కేసునమోదు చేసుకుని పనిమనిషి రాజమణి ఆలియాస్ రాధాను అదుపులోకి తీసుకుని విచారించడంతో తానే ఆరు తులాల బంగారు ఆభరణాలు చోరి చేసినట్లు ఒప్పుకుందని సీఐ తెలిపారు. రాజమణిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు తెలిపారు. ఈ కేసులో 3వ టౌన్ ఎస్సై లక్ష్మయ్య, ఏఎస్సై రామకృష్ణ, కానిస్టేబుల్ కవితలను ఏసీపీ అభినందించారని సీఐ తెలిపారు.