- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వేరే వ్యక్తితో క్లోజ్‌గా ఉంటుందని సహజీవనం చేస్తున్న మహిళను..
దిశ, వెబ్‌డెస్క్: సహజీవనం చేస్తున్న మహిళ వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని ఓర్వలేక ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. గొంతు నులిమి వివాహితను హత్య చేసి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన విశాఖలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా పరవాడ కు చెందిన గోపాల్ పెయింటింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు అదే ప్రాంతానికి చెందిన ఓ వివాహిత(28)తో పరిచయం ఏర్పడింది. భర్తతో విభేదాల కారణంగా ఒంటరిగా ఉంటున్న మహిళ, గోపాల్ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని జీవిస్తున్నారు. గోపాల్ తన ఫ్రెండ్ వెంకటేష్ ను ఇటీవల మహిళకు పరిచయం చేశాడు. మహిళ వెంకటేష్ తో తరచూ మాట్లాడుతుండటాన్ని గమనించిన గోపాల్ మాట్లాడుకుందామని మహిళను ఆర్కే బీచ్ కు పిలిచాడు. మహిళ, వెంకటేష్, గోపాల్ ఒకే వాహనంపై బీచ్‌కు వెళ్లారు. మహిళతో ఒంటరిగా మాట్లాడాలని చెప్పి వెంకటేష్‌ను పంపించేసాడు. ఆ తర్వాత మహిళతో వెంకటేష్ తో మాట్లాడే విషయంతో వాగ్వాదం జరిగింది. అది కాస్తా పెరగడంతో కోపంతో మహిళ గొంతు నులిమి చంపేశాడు. అనంతరం నేరుగా గాజువాక పీఎస్ కు వెళ్లి లొంగిపోయాడు.