- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లాస్టిక్ కవర్లో మొండెం లేని మహిళ తల.. తీవ్ర భయాందోళనలో స్థానికులు
by Satheesh |
X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: మూసీ పరివాహక ప్రాంతంలో ఓ మహిళ తల ప్లాస్టిక్ కవర్లో దొరకటం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. మంగళవారం ఉదయం మలక్ పేట తీగలగూడ మూసీ పరివాహక ప్రాంతంలోకి స్థానికులు కొందరు కాలకృత్యాలు తీర్చుకోవటానికి వెళ్లగా ప్లాస్టిక్ కవర్లో మహిళ తల కనిపించింది. వెంటనే వాళ్లు మలక్ పేట్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు.
ఈ క్రమంలో పోలీసులు క్లూస్ టీంతో అక్కడికి చేరుకున్నారు. మహిళను ఎక్కడో చంపి తల నరికి ఇక్కడకు తెచ్చి పడేసి ఉంటారని పోలీసులు చెప్పారు. హతురాలు ముస్లిం మహిళ అయి ఉండవచ్చన్నారు. డాగ్ స్క్వాడ్‌ను రప్పించినా పెద్దగా ప్రయోజనం కలగలేదు. మలక్ పేట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story