బొమ్మ తుపాకీ అనుకొని అక్కనే కాల్చి చంపిన మూడేళ్ల చిన్నారి

by Sathputhe Rajesh |
బొమ్మ తుపాకీ అనుకొని అక్కనే కాల్చి చంపిన మూడేళ్ల చిన్నారి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆట వస్తువు అనుకొని ఓ మూడేళ్ల చిన్నారి నిజమైన గన్ పేల్చింది. ఈ ఘటనలో చిన్నారి నాలుగేళ్ల సోదరి కన్నుమూసింది. అమెరికాలోని టెక్సాస్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హూస్టన్ ప్రాంతంలోని టామ్ బాల్ పార్క్ వే సమీపంలోని ఓ అపార్ట్ మెంట్ లో ఓ కుటుంబం నివాసముంటుంది. దంపతులకు ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

వీరు ఆదివారం సాయంత్రం బెడ్ రూమ్ లో ఆడుకుంటుండగా పెద్దవారు తమ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఒక్కసారిగా బెడ్ రూం లోంచి తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. వెంటనే వారొచ్చి చూసే సరికి నాలుగేళ్ల చిన్నారి రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే చిన్నారిని హాస్పిటల్ కు తీసుకెళ్లగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో మూడేళ్ల పాపకు ఫుల్ లోడ్ చేసిన సెమీ ఆటోమెటిక్ గన్ దొరికింది. బొమ్మ తుపాకీగా బావించిన చిన్నారి తన నాలుగేళ్ల సోదరిని కాల్చింది. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story