80 రూపాయల బిర్యానీ కోసం వెళ్లి రూ.4 లక్షలు పోగొట్టుకున్నారు (వీడియో)

by Javid Pasha |
80 రూపాయల బిర్యానీ కోసం వెళ్లి రూ.4 లక్షలు పోగొట్టుకున్నారు (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: ఆకలితో హోటల్ కు వెళ్లిన కొందరు యువకులు అనుకోని విధంగా షాక్ కు గురయ్యారు. బిర్యానీ కోసం వెళ్లి 4 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని భీమవరానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి తన అనుచరులైన కొందరు యువకులకు రూ.4 లక్షలు ఇచ్చి బ్యాంక్ లో డిపాజిట్ చేయమని పంపించాడు. ఈ క్రమంలోనే స్కూటీపై ఆ యువకులు బ్యాంక్ కు వెళ్లగా.. టైం అయిపోయిందంటూ బ్యాంక్ అధికారులు చెప్పారు. దీంతో వాళ్లు బ్యాంకు నుంచి బయటకు వచ్చారు.

ఈ క్రమంలోనే బిర్యానీ తినడానికి ఆ యువకులు స్థానికంగా ఉన్న సీతయ్య హోటల్ వద్ద స్కూటీ డిక్కీలో రూ.4 లక్షల బ్యాగ్ ను దాచి పెట్టారు. అయితే ఇది గమనించిన దొంగలు స్కూటీ డిక్కీలో దాచిపెట్టిన డబ్బు సంచీని దోచుకెళ్లారు. బిర్యానీ తిన్నాక బయటకు వచ్చి చూసిన యువకులు.. స్కూటీలో డబ్బు లేకపోవడంతో లబోదిబోమన్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Next Story