- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దారుణం: 2 వేల కోసం పోస్ట్ మార్టం చేయని సిబ్బంది.. మృతదేహాన్ని కొరికిన ఎలుకలు

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఏలూరు జిల్లాలోని చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల ప్రకారం ఏలూరు జిల్లాకు చెందిన కృష్ణవేణి అనే ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో పోస్ట్ మార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని పోలీసులు చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, పోస్ట్ మార్టం చేసేందుకు ఆసుపత్రి సిబ్బంది మృతురాలి కుటుంబ సభ్యులను రెండు వేలు డిమాండ్ చేశారు. దీనికి కృష్ణవేణి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో మృతదేహానికి పోస్ట్ మార్టం చేయకుండా అలాగే ఉంచారు. దీంతో కృష్ణవేణి మృతదేహాన్ని మార్చురీలో ఎలుకలు కొరికినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story