- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కెనడాలో మచిలీపట్నం విద్యార్థి మృతి
దిశ, డైనమిక్ బ్యూరో : కెనడాలో ఉన్నత విద్యనభ్యసించేందుకు వెళ్లిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు మరణించాడు. వివరాల్లోకి వెళ్తే మచిలీపట్నం చింతకుంటపాలెం చెందిన శ్రీనివాస్, మీనాకుమారి దంపతులు. శ్రీనివాస్ ట్రెజరీలో సాధారణ ఉద్యోగి. మీనాకుమారి బ్యూటీ పార్లర్ నడుపుతోంది. అయితే వీరి కుమారుడు పోలుకొండ లెనిన్ నాగ కుమార్ (23) 2021లో ఎంఎస్ చదువు నిమిత్తం కెనడా వెళ్ళారు. చదువులో చురుకుగా ఉంటూ అందరితో కలిసిపోయే నాగ కుమార్ సోమవారం తన స్నేహితులతో కలిసి కెనడాలోని సిల్వర్ ఫాల్స్‌కు వెళ్లాడు.
అయితే అక్కడ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నాగ కుమార్ మృతితో చింతకుంట పాలెంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. నాగకుమార్ మృతదేహాన్ని కెనడా నుంచి మచిలీపట్నంకు ఎలా తీసుకురావాలో తెలియక తల్లిదండ్రులు విలపిస్తున్నారు. తమ కుమారుడి చివరి చూపు దక్కేలా చూడాలని అధికారులను కోరుతున్నారు.