నాలుగేళ్ల బాలుడిపై ఎద్దు దాడి.. బాలుడి పరిస్థితి విషమం

by Javid Pasha |
నాలుగేళ్ల బాలుడిపై ఎద్దు దాడి.. బాలుడి పరిస్థితి విషమం
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ లో దారుణం జరిగింది. వీధిలో ఒంటరిగా ఉన్న ఓ నాలుగేళ్ల బాలుడిపై ఓ ఎద్దు దాడి చేసింది. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆ బాలుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ లో ఓ నాలుగేళ్ల బాలుడిని వెంటబెట్టుకుని ఓ వ్యక్తి తమ ఇంటి ముందు ఉన్న వీధిలోకి వెళ్లాడు. బాలుడిని రోడ్డు మీద వదిలిన ఆ వ్యక్తి.. ఏదో తీసుకురావడానికి ఇంట్లోకి వెళ్లాడు. అయితే అప్పుడే అటుగా వచ్చిన ఎద్దు బాలుడిపై వెనుక వైపు నుంచి దాడి చేసింది. తన కొమ్ములతో అమాంతం పైకి లేపి కింద పడేసింది. అయితే అప్పుడే ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి ఎద్దును అక్కడి నుంచి తరిమికొట్టాడు.

కాగా ఎద్దు దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు కాగా.. వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం బాలుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. కాగా బాలుడిపై ఎద్దు దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ సిబ్బంది ఎద్దును పట్టుకోవడానికి రంగంలోకి దిగింది.


Advertisement

Next Story