భర్తను విడిచిపెట్టి కొడుకును పెళ్లి చేసుకున్న సవతి తల్లి..

by sudharani |
భర్తను విడిచిపెట్టి కొడుకును పెళ్లి చేసుకున్న సవతి తల్లి..
X

దిశ, వెబ్‌డెస్క్: తల్లి అంటే దైవంతో సమానం. పిల్లలకు ఎటువంటి ఆపద రాకుండా చూసుకుంటుంది. వారు తప్పు చేస్తే నిందించి సరైన మార్గంలో నడిపిస్తుంది. అలాంటి పవిత్రమైన బంధానికి మచ్చ తెచ్చింది ఓ మహిళ. పెంచి పెద్ద చేసిన కొడుకునే పెళ్లి చేసుకుంది. అంతే కాదు అతనితో ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చింది. ఈ దారుణ సంఘటన సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఓ ప్రాంతానికి చెందిన మెరీనా బల్మషేవ అనే మహిళ.. ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే ఆ వ్యక్తికి అప్పటికే వ్లాదిమిర్ షావిరిన్ (7) అనే కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడుని పెంచే బాధ్యత సవతి తల్లిగా మెరీనా తీసుకుంది. కొడుకును పెంచే క్రమంలో అతడితోనే ప్రేమలో పడింది. సవతి తల్లి కొడుకుల మధ్య బంధం అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. ఈ క్రమంలో మెరీనా తన భర్తను కూడా విడిచి పెట్టి పెంచిన కొడుకుతో పారిపోయింది. అనంతరం వారిద్దరూ పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చారు. అయితే ఇదే విషయాన్ని సదరు వ్యక్తులు సోషల్ మీడియాలో పంచుకోగా.. నెటిజన్లు వారిపై తీవ్ర ఎత్తున మండిపడుతున్నారు. కాగా.. దీనికి సంబంధించిన న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

Next Story