బ్రేకింగ్: కలకలం రేపుతోన్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగి సెల్ఫీ వీడియో

by Satheesh |   ( Updated:2023-03-28 04:58:56.0  )
బ్రేకింగ్: కలకలం రేపుతోన్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగి సెల్ఫీ వీడియో
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నంలోని వడ్లపూడి తిరుమలనగర్‌లో సెల్ఫీ వీడియో కలకలం రేపింది. వివరాల ప్రకారం.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగి అయిన వరప్రసాద్ దంపతులు గత కొంత కాలంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు మరి ఎక్కువ కావడంతో చేసేదేమి లేక ఆత్మహత్య చేసుకున్నట్లు సోమవారం సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, వరప్రసాద్ దంపతుల చెప్పులు, ఫోన్, హ్యాండ్ బాగ్ అనకాపల్లి జిల్లా కొప్పాక ఏలూరు కాలువ దగ్గర గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతానికైతే వారు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story