- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మితిమీరిన వేగంతో కారును ఢీ కొట్టిన మట్టి టిప్పర్..
దిశ, గుమ్మడిదల : మితిమీరిన వేగంతో మట్టి టిప్పర్ కారును ఢీ కొట్టడంతో ఒకరు మృతి ముగ్గురు తీవ్రగాయాలపాలైన ఘటన గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామ శివారు అడవి ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నర్సాపూర్ గ్రామానికి చెందిన సూర్య ప్రకాష్ రావు అతని కుటుంబ సభ్యులు భార్య నాగరాణి, అమ్మ హరిభూషణమ్మ, చిన్నమ్మ అన్నపూర్ణలతో కలిసి బుధవారం మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో హైదరాబాద్ వైపు నుండి నర్సాపూర్ వైపు వెళ్తున్నాడు. సరిగ్గా గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామ శివారు అడవి ప్రాంతానికి చేరుకోగానే నర్సాపూర్ వైపు నుండి వస్తున్న అతి భారీ వాహనం మట్టి టిప్పర్ అతివేగంగా వస్తూ వీరు ప్రయాణిస్తున్న కారకు ఢీ కొట్టింది.
దీంతో కారు నుజ్జునుజై అందులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడినుండి క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో సూర్యప్రకాష్ రావు అమ్మ హరిబుషనమ్మ (75) గురువారం ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా సూర్య ప్రకాష్ రావు సోదరుడు ప్రభాకర్ రావు ఫిర్యాదు చేయగా కేసునమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించినట్లు గుమ్మడిదల ఎస్సై విజయ్ కృష్ణ తెలిపారు.