చెరువులో మునిగి గొర్రెల కాపరి మృతి

by Javid Pasha |
చెరువులో మునిగి గొర్రెల కాపరి మృతి
X

దిశ, గద్వాల్ రూరల్: ప్రమాదవశాత్తు చెరువులో జారి పడి గొర్రెల కాపరి మృతి చెందిన ఘటన శుక్రవారం గద్వాల్ మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గద్వాల మండలం ఈడిగోనిపల్లి గ్రామానికి చెందిన కుర్వ చిన్నగోవిందు రెండవ కుమారుడు కుర్వ మల్లి(19) అనే యువకుడు గొర్ల కాపరిగా పని చేస్తున్నాడు. రోజు మాదిరిగానే శుక్రవారం గొర్రెలు కాసేందుకు వెళ్లాడు. పెద్దపాడు గ్రామ చెరువులోకి దిగి గొర్రెలను కడుగుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడిపోయాడు.

ఈత రాకపోవడంతో చెరువులోనే ప్రాణాలు వదిలినట్లు తెలిసింది‌. చెరువు వద్దకు వెళ్లి చూడగా పూర్తిగా మునిగిపోయి ఉన్నట్లు గమనించారు. పలువురు గ్రామస్థులు చెరువులో వెతికి మల్లి మృతదేహాన్ని వెలికితీశారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గద్వాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed