మూడేళ్ల పాపపై ఏడేళ్ల బాలుడి అత్యాచారం..!

by Javid Pasha |
మూడేళ్ల పాపపై ఏడేళ్ల బాలుడి అత్యాచారం..!
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఘోరం జరిగింది. ఓ మూడేళ్ల పాపపై ఏడేళ్ల బాలుడు అత్యాచారానికి ప్రయత్నించాడు. అయితే బాలిక అరుపులు విని చుట్టుపక్కలవాళ్లు రావడంతో ఆ బాలుడు అక్కడి నుంచి పారిపోయాడు. చకేరీ ఏసీపీ అమర్ నాథ్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్ జిల్లా చకేరీ పట్టణంలోని డబుల్ కాలనీకి చెందిన ఓ ఏడేళ్ల బాలుడు అదే కాలనీకి చెందిన మూడేళ్ల పాపను సైకిల్ మీద డ్రెయిన్ పక్కకు తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడు.

అయితే ఆ పాప భయంతో అరుపులు పెట్టడంతో ఆమెను బ్లేడ్ తో గాయపరిచాడు. ఇక బాలిక అరుపులు విన్న చుట్టుపక్కలవాళ్లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో ఆ బాలుడు అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర గాయాలపాలైన బాలికను స్థానికులు లోకల్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ లోగా బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.

Advertisement

Next Story