కోరుట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. భర్త మృతి, భార్య పరిస్థితి విషమం

by Javid Pasha |
కోరుట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. భర్త మృతి, భార్య పరిస్థితి విషమం
X

దిశ, కోరుట్ల టౌన్: కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ అంబేద్కర్ చౌక్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో కోరుట్ల మండలం తిమ్మాయపల్లె గ్రామానికి చెందిన సుర భీమయ్య (33) లారీ టైర్ల కిందపడి మృతి చెందగా అతని భార్య ప్రేమలత తీవ్ర గాయాలపాలు కాగా ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే కోరుట్ల మండల తిమ్మాయపల్లె గ్రామానికి చెందిన సుర భీమయ్య, అతని భార్య ప్రేమలత ఇధ్దరు కూలీ పని నిమిత్తం మోటర్ సైకిల్ పై కోరుట్ల పట్టణానికి వచ్చారు.

ఈ క్రమంలో కోరుట్ల కొత్త బస్టాండ్ వద్ద రోడ్డు దాటుతుండగా ఎదురుగా వస్తున్న అర్జె 11 జి.బి 0843 నంబర్ గల లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో భీమయ్య అక్కడిక్కడే మృతి చెందగా ప్రేమలతకు తీవ్ర గాయాలయ్యాయి. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. సంఘటన స్థలానికి కోరుట్ల సీఐ ప్రవీణ్ కుమార్ చేరుకొని పరిశీలించారు. ఘటన స్థలంలో బంధువుల రోదనలు మిన్నంటాయి.

Advertisement

Next Story