జీవితంపై విరక్తి కలిగి వ్యక్తి ఆత్మహత్య

by Shiva |
జీవితంపై విరక్తి కలిగి వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, కామారెడ్డి రూరల్ : కంటి వ్యాధితో గత కొన్ని రోజులుగా బాధపడుతున్న ఓ వ్యక్తి ఎన్ని ఆస్పత్రుల్లో చూయించుకున్న నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని టేకిర్యాల గ్రామంలో చోటుచేసుకుంది. దేవునిపల్లి ఎస్సై ప్రసాద్, మృతుడి కుమారుడు శ్రీనివాస్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన దూలం పోచయ్య (65) అనే వ్యక్తి కంటికి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. ఇదే విషయమై ఆయన పలు ఆసుపత్రుల్లో చూపించుకున్నప్పటికీ వ్యాధి ఏమాత్రం తగ్గలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన పోచయ్య 18న ఇంట్లో ఎవరూ లేని సమయంలో బయటకు వెళ్లిపోయాడు. అతని ఆచూకీ కోసం ఎక్కడ గాలించిన కనిపించ లేదు. కాగా గ్రామ శివారులోని డబుల్ బెడ్ రూం ఇళ్ల సమీపంలో పోచయ్య మృతదేహం లభించగా అతను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.

Advertisement

Next Story