రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

by Shiva |
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
X

కోరుట్ల మండలం వెంకటాపూర్ స్టేజి వద్ద ఘటన

దిశ, కోరుట్ల రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయలైన ఘటన కోరుట్ల మండలం వెంకటాపూర్ స్టేజి వద్ద సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మన్నెగూడెం గ్రామానికి చెందిన పంచతీ హన్మాండ్లు (55), రాజం (54) తమ వ్యక్తిగత పని నిమిత్తం ఇద్దరు కలిసి ఒకే బైక్ పై కోరుట్ల వెళ్తున్నారు. ఈ క్రమంలోనే బైక్ వెంకటాపూర్ స్టేజి వద్దకు రాగానే రోడ్డు క్రాస్ చేస్తుండగా.. జగిత్యాల నుంచి ముంబై వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు బైక్ ను పక్క నుంచి బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో హన్మాండ్లు తలకు తీవ్ర గాయలు కాగా, అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అదేవిధంగా బైక్ వెనకాలే కూర్చున్న రాజం కు తీవ్రగాయాలు కాగా అతడిని కరీంనగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, శనివారం ఇదే కోరుట్ల ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కూలీ పని చేసుకునే దంపతులు మృతి చెందగా, కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే రోడ్డు ప్రమాదంలో మరోకరు మృతి చెందడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Advertisement

Next Story