మద్యం కోసం నెల రోజుల వయసున్న మనవడినే కిడ్నాప్

by Mahesh |
మద్యం కోసం నెల రోజుల వయసున్న మనవడినే కిడ్నాప్
X

దిశ, ఖైరతాబాద్: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి నెల రోజుల వయసున్న మనవడిని కిడ్నాప్ చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. హకీంపేట గౌసియా మసీదు సమీపంలో నివసించే మహమ్మద్ ఖలీల్ (40) కూతురు యాస్మిన్ బేగం గత నెల 13వ తేదీన మగబిడ్డకు జన్మనిచ్చింది. తండ్రి ఇంట్లోనే ఉంటున్నది. మద్యానికి బానిసైన ఖలీల్ తరచూ భార్యను డబ్బులు అడుగుతూ వేధిస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 14వ తేదీన సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఖలీల్ ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయాడు. తీరా చూస్తే తన నెల రోజుల కొడుకు కూడా కనిపించడం లేదని, తన తండ్రే డబ్బుల కోసం మనవడ్ని కిడ్నాప్ చేసి ఉంటాడని బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని చిన్నారిని ఎత్తుకెళ్లిన ఖలీల్ కోసం గాలింపు చేపట్టారు.

Advertisement

Next Story