Crime News : మైనర్‌‌‌పై రెండు రోజులపాటు సామూహిక అత్యాచారం.. ఆ తర్వాత

by Hamsa |   ( Updated:2023-02-14 05:00:51.0  )
Crime News : మైనర్‌‌‌పై రెండు రోజులపాటు సామూహిక అత్యాచారం.. ఆ తర్వాత
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత కాలంలో అమ్మాయిలపై కొంత మంది దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో మార్పు రావడం లేదు. అమ్మాయిలు ఒంటరిగా కనిపిస్తే చాలు వారిని కిడ్నా్ప్ చేసి అత్యచారాలకు పాల్పడుతున్నారు. చిన్నా పెద్ద ముసలి ముతకా అన్న కనికరం లేకుండా దుర్మార్గులు నీచాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో నిత్యం చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, తమిళనాడులో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల ప్రకారం.. తమిళనాడులో శివగంగై జిల్లాలోని దేవకొట్టై సమీపంలో ఓ 17 ఏళ్ల బాలిక ఇంటర్ చదువుతూ తన తండ్రితో కలిసి నివసిస్తుంది. అయితే ఒకరోజు బాలిక ఒంటరిగా ఉండగా 5 ఐదుగురు యువకులు వచ్చి ఆమెను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా రెండు రోజుల పాటు ఆమెను పస్తులుంచి సామూహిక అత్యాచారం చేశారు. రెండురోజుల గడిచి పోయాక దేవకొట్టే బస్టాండ్ దగ్గర పడేసి అక్కడి నుండి పారిపోయారు. రెండురోజుల నుండి బాలిక కనిపించక పోవడంతో ఊరంతా వెతుకుతున్న తండ్రికి బస్టాండ్‌లో సరిగ్గా బట్టలు లేని దీనస్థితిలో కూతురు కనిపించడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. వెంటనే బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాక బాలిక నుండి వివరాలు ఆరా తీసి తెలుసుకుని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి : బాలికపై అత్యాచారం.. ఆపై చంపుతానంటూ..

Advertisement

Next Story