మైనర్ బాలికపై లైంగికదాడి

by Javid Pasha |
మైనర్ బాలికపై లైంగికదాడి
X

దిశ, నెల్లూరు: చెల్లి చెల్లి అంటూ పిలుస్తూ,తమకు తెలియకుండా తమ కూతురును కొన్ని నెలల నుండి అత్యాచారం చేస్తున్నాడని మంగళవారం బాలిక తల్లి తండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని కోవూరు పంచాయతీ గుమ్మలదిబ్బ ప్రాంతానికి చెందిన నిడిగుంట పవన్ అనే వ్యక్తి తమతో ఎంతో సన్నిహితంగా ఉంటూ బాలిక తనచెల్లి అని చెప్పుకునే వాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు కూడా పెద్దగా పట్టించుకునే వారు కాదు.

ఇదే అదునుగా భావించిన పవన్ గత కొద్ది రోజులుగా ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఈ విషయాన్ని ఇంట్లో తల్లిదండ్రులు గాని మరి ఎవరికైనా చెప్పినా చంపేస్తానని బెదిరించాడు. చివరకు ఆ మైనర్ బాలిక మృగాడి హింసను తట్టుకోలేక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కోవూరు పోలీసులకు పిర్యాదు చేశారు. తమ బిడ్డ జీవితాన్ని అన్యాయం చేసిన ఆ కామాంధుడైన పవన్ కు బుద్ధి చెప్పాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement

Next Story