మాట్లాడుతుండగానే లక్షల క్యాష్ మాయం.. జ్యూవెలరీ షాప్‌లో క్యాష్ కొట్టేసిన మైనర్ బాలుడు.. (వీడియో)

by Vinod kumar |   ( Updated:2024-05-31 07:20:27.0  )
మాట్లాడుతుండగానే లక్షల క్యాష్ మాయం.. జ్యూవెలరీ షాప్‌లో క్యాష్ కొట్టేసిన మైనర్ బాలుడు.. (వీడియో)
X

దిశ, గద్వాల్: జ్యూవెలరీ బంగారు దుకాణంలో కష్టమర్ క్యాష్ కొట్టేసిన సంఘటన సోమవారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. సుమారు రూ.3.50 లక్షల క్యాష్ కాజేసినట్లు బాధితుడు కృష్ణయ్య పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కృష్ణయ్య గద్వాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. గత ఏడాది గద్వాల పట్టణం ఎల్లప్ప హాస్పిటల్ సమీపంలో గల శ్రీ రాఘవేంద్ర జ్యూవెలరీ షాప్ లో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినట్లు, తిరిగి వాటిని విక్రయించేందుకు అదే షాప్ కు వెళ్లాడు. బంగారు ఆభరణాలు విక్రయించగా సుమారు‌ రూ. 3.5 లక్షల నగదు రావడంతో నగదును లగేజ్ బ్యాగ్ లో ఉంచి అక్కడే దుకాణంలో పెట్టాడు.

ఆ తర్వాత దుకాణం నిర్వాహకులతో మాట్లాడుతుండగా ఓ మహిళతో పాటు వచ్చిన ఓ మైనర్ బాలుడు నగదును కాజేసి అక్కడ నుంచి పరారయ్యారు. అనంతరం బాధితుడు లగేజ్ బ్యాగ్ ను చెక్ చేసుకోగ అందులో ఉంచిన నగదు మాయమైనట్లు గుర్తించారు‌. ఈ తతంగం అంతా సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గద్వాల్ టౌన్ ఎస్ఐ షుకూర్ వెల్లడించారు.

Advertisement

Next Story