- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువతిని అలా చూసిందే కాక వాళ్ల బాబాయినీ హత్య చేసిండు
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: తన అన్న కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న యువకున్ని నిలదీసిన పాపానికి హత్యకు గురయ్యాడు ఓ వ్యక్తి. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో విచారణ చేపట్టిన బాలాపూర్పోలీసులు ఈ ఘాతుకానికి పాల్పడ్డ నిందితున్ని నలభై ఎనిమిది గంటల్లోనే అరెస్టు చేశారు. మహేశ్వరం జోన్‌డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం బస్తర్ జిల్లా మదులపాలు గ్రామానికి చెందిన కే.కశ్యప్(30) కొంతకాలం క్రితం ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చి బాలాపూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామంలో స్థిరపడ్డాడు. కూలీగా పని చేస్తూ జీవనం గడుపుతున్నాడు.
ఇదిలా ఉండగా నాలుగు నెలల క్రితం అతని అన్న కూతుళ్లు ఊర్మిళ కశ్యప్, భువనేశ్వరి కశ్యప్‌లు తమ గ్రామానికే చెందిన మరికొందరితో కలిసి సుల్తాన్‌పూర్‌లోని రాజ్‌గురు ప్లైవుడ్ డోర్స్యూనిట్లో పని చేయటానికి ఇక్కడకు వచ్చారు. బాబాయ్ కశ్యప్ ఇంట్లోనే ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా వీరి ఇంటి పక్కనే నివాసముంటున్న సోనూ నంది ఎలియాస్బంటి (27) కొన్నిరోజులుగా ఊర్మిళ పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఈనెల 4న రాత్రి 11.30 గంటల సమయంలో ఊర్మిళ గదిలో దుస్తులు మార్చుకుంటుండగా కిటికీ నుంచి చూశాడు. ఇది గమనించిన ఊర్మిళ బాబాయ్ కశ్యప్ఇంటికి రాగానే జరిగిన విషయాన్ని చెప్పింది. ఈ క్రమంలో కశ్యప్ పక్కనే ఉంటున్న సోనూ నంది గదికి వెళ్లి అతన్ని నిలదీశాడు.
దాంతో రెచ్చిపోయిన సోనూ నంది తన వద్ద ఉన్న కత్తితో కశ్యప్‌పై దాడి చేసి ఛాతీపై పొడిచాడు. అడ్డుకోవటానికి ఊర్మిళ ప్రయత్నించగా ఆమె చేతిపై పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఊర్మిళ వెంటనే బాబాయ్‌ను ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు కత్తిపోటు గుండెల్లో దిగటంతో అప్పటికే మరణించినట్టు ప్రకటించారు. ఈ మేరకు ఊర్మిళ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన బాలాపూర్బీ.భాస్కర్కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుని కోసం ముమ్మరంగా గాలింపు జరిపి మంగళవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, ఒప్పో మొబైల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.