Crime News: చిక్కడపల్లిలో అర్థరాత్రి వ్యక్తి దారుణ హత్య

by Satheesh |   ( Updated:2023-02-14 04:57:49.0  )
Crime News: చిక్కడపల్లిలో అర్థరాత్రి వ్యక్తి దారుణ హత్య
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: చిక్కడపల్లి ప్రాంతంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. చిక్కడపల్లి ప్రాంతంలోని వివేక్నగర్‌లో ఉన్న హనుమాన్ ఆలయం సమీపంలో ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్న కుంటి శీను అనే వ్యక్తిని దుండగులు తలపై బండరాయితో కొట్టి చంపారు. తెల్లవారు జామున గుడికి వచ్చిన కొందరు ఇది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే చిక్కడపల్లి పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని మార్చురికి తరలించారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు.

ఇవి కూడా చదవండి : బ్రేకింగ్: బావను హత్య చేసినందుకు మరదలికి సన్మానం..

Advertisement

Next Story

Most Viewed