అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

by Shiva |
అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని మంగళవారం రాజన్న సిరిసిల్ల టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట్ మండలం వెంకటాపుర్ గ్రామానికి చెందిన పత్రి సతీష్ నాందేడ్ లో గంజాయిని గుర్తు తెలియని వ్యక్తి దగ్గర కొనుగోలు చేశాడు. అనంతంర కామారెడ్డి మీదుగా రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రానికి వస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద సాయంత్రం 6 గంటల పాంత్రంలో పోలీసులు సతీష్ ను, అతని వద్ద ఉన్న కేజీ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి కోర్టుకు తరలించనున్నట్లు సిరిసిల్ల టౌన్ సీఐ అనీల్ కుమార్ తెలిపారు.

Advertisement

Next Story