- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఫాదర్స్ డే: తాగిన మత్తులో కన్నతండ్రిని చంపిన కొడుకు
దిశ, వెబ్ డెస్క్: ఫాదర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఫాదర్స్ కు సంతోషాన్ని కలిగించేలా ఏదో ఒక పని చేస్తుంటే.. రాజస్థాన్ లో మాత్రం ఓ కొడుకు తన కన్నతండ్రినే కడతేర్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ లోని ఆజ్మర్ కు చెందిన ముఖేశ్ కు అతడి తండ్రి బేగారామ్ కు ఓ భూమి విషయంలో తరచూ గొడవలు జరుతుండేవి. ఈ క్రమంలోనే ఆదివారం తండ్రీకొడుకుల మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ సమయంలో బేగారామ్ భార్య కూడా అక్కడే ఉంది. అయితే కొంత సేపటి తర్వాత వివాదం సద్దుమణగడంతో ఆమె పని నిమిత్తం బయటకు వెళ్లింది. అయితే కొంత సమయం తర్వాత ఇంటికి వచ్చిన ఆమె.. లోపల భర్త హత్యకు గురైన విషయం చూసి షాకైంది.
వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం బాడీని పోస్టుమార్టం కోసం పంపించారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుమారుడిని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులకు.. మద్యం మత్తులో తమ నాన్నను హత్య చేసినట్లు నిందితుడు ఒప్పకున్నట్లు తెలుస్తోంది. విచారణ కొనసాగుతోంది.