జగిత్యాల జిల్లాలో అన్నను చంపిన తమ్ముడు

by Mahesh |
జగిత్యాల జిల్లాలో అన్నను చంపిన తమ్ముడు
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్‌లో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన ఇడగొట్టు తిరుపతి (45) ని పాత కక్షల నేపథ్యంలో తమ్ముడు శ్రీనివాస్ హతమార్చాడు. ఆదివారం అర్ధరాత్రి నిద్రిస్తున్న తిరుపతిపై తమ్ముడు శ్రీనివాస్ రోకలిబండతో దాడి చేసినట్లు తెలుస్తుంది. తలకు బలమైన గాయం కావడంతో తిరుపతి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఘటనపై బుగ్గారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అన్నదమ్ముల మధ్య ఉన్న ఆస్తి తగాదాలే హత్యకు కారణం అయి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed