రైలు కింద పడి వ్యక్తి బలవన్మరణం

by Shiva |
రైలు కింద పడి వ్యక్తి బలవన్మరణం
X

దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి రైల్వే స్టేషన్ ఒకటో నెంబర్ ప్లాట్ ఫాం వద్ద సోమవారం అమరావతి నుంచి తిరుపతి వెళ్లే రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్సై తావునాయక్ తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. కాగా, మృతుడు మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిగా సమాచారం. సంబంధిత వ్యక్తులు ఎవరైనా ఉంటే కామారెడ్డి రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.

Advertisement

Next Story