రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

by Javid Pasha |
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
X

దిశ, కళ్యాణదుర్గం: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన కళ్యాణదుర్గం మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు కథనం ప్రకారం.. కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన బోయ శ్రీనివాసులు వెంకటపల్లి వద్ద పొలం పనులు ముగించుకొని ఇంటికి తిరిగివస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన కళ్యాణదుర్గం మండలంలోని గోళ్ల ఆంజనేయ స్వామి గుడి వద్దకు చేరుకోగానే అనంతపురం నుంచి వస్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.

Advertisement

Next Story