అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య

by Javid Pasha |
అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, మీర్ పేట్: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ ఈ నరసింహ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. బడంగ్ పేట్ గాంధీనగర్ లో నివసించే ఆవుల శీను (36 ) అప్పులు చేసి తరచూ భార్యతో గొడవపడేవాడు. రోజు మాదిరిగానే శనివారం మధ్యాహ్నం భార్యాభర్తలు మరోసారి గొడవపడగా క్షణకావేశంలో గదిలోకి వెళ్లిన శీను చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. శీను మరణంతో బాధిత కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story