ఉరేసుకొని వ్యక్తి మృతి

by Javid Pasha |
ఉరేసుకొని వ్యక్తి మృతి
X

దిశ, తుంగతుర్తి: ఆస్తుల వివాదాలతో జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఇంట్లోనే ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తుంగతుర్తి మండలం దేవునిగుట్ట తండ గ్రామంలో మంగళవారం జరిగింది. ఎస్సై డానియల్ కథనం ప్రకారం.. దేవునిగుట్ట తండ గ్రామానికి చెందిన బానోతు టాక్రు (60) కు భార్యతో పాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. వివాహమైన కుమారులు తల్లిదండ్రులతో విడిపోయి వేరువేరుగా ఉంటున్నారు. అయితే గత కొంతకాలంగా ఆస్తుల విషయంలో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తాయి.

దీంతో మానసికంగా కృంగిపోయిన టాక్రు భార్య పూలమ్మ వ్యవసాయ పనులకు వెళ్లగా తన ఇంట్లో చీరతో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పనులను ముగించుకొని ఇంటికి వచ్చిన భార్య.. భర్త ఉరేసుకోవడం చూసి బోరున విలపించింది. లబోదిబోమంటూ చుట్టుపక్కల వాళ్లను పిలిచింది. వాళ్ల సహాయంతో మృతదేహాన్ని కిందికి దింపారు. భార్య పూలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డానియల్ తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

Advertisement

Next Story