ఏపీలో సెల్ఫీ సూసైడ్ కలకలం.. సొంత అన్న మోసం చేశాడని దారుణం!

by Satheesh |   ( Updated:2023-01-28 06:16:51.0  )
ఏపీలో సెల్ఫీ సూసైడ్ కలకలం.. సొంత అన్న మోసం చేశాడని దారుణం!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో సెల్ఫీ సూసైడ్ కలకలం రేపింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట రావుల పేటలో వ్యాపారంలో సోదరుడు మోసం చేశాడని ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. మండపేట రావుల పేట మండలానికి చెందిన వీర్రాజు అనే వ్యక్తి సోదరుడితో కలిసి వ్యాపారం చేస్తున్నాడు. కాగా, వ్యాపారంలో వీర్రాజును అతడి సోదరుడు, సోదరుడి కుమారుడు మోసం చేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన వీర్రాజు.. సోదరుడు, అతడి కుమారుడు నన్ను అప్పుల పాలు చేశారని సెల్ఫీ వీడియో తీసుకుంటూ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి: మత్తు మందు ఇచ్చి మైనర్‌పై సామూహిక అత్యాచారం..

Advertisement

Next Story