ఉద్యోగం నుంచి తొలగించారని వ్యక్తి ఆత్మహత్య..

by Kalyani |
ఉద్యోగం నుంచి తొలగించారని వ్యక్తి ఆత్మహత్య..
X

దిశ, మానవపాడు: ఉద్యోగం నుంచి తొలగించారని మనస్థాపం చెందిన ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ పట్టణం మల్కాజ్ గిరి గాజుల రామారాం కాలనీకి చెందిన ఏపూరి సురేష్ (40) ప్రైవేట్ ఉద్యోగిగా హైదరాబాదులోనే విధులు నిర్వహిస్తున్నాడు. రెండు నెలల క్రితం ఉద్యోగం నుంచి తొలగించారు. ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్లిన ఉద్యోగం దక్కలేదు.

దీంతో మనస్థాపానికి గురై మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు-నారాయణపురం రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల పైకి చేరుకొని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య స్వప్న గుర్తించడంతో కేసు నమోదు చేసి గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.

Advertisement

Next Story