దారుణం.. నడిరోడ్డు మీద మద్రాస్ లాయర్ హత్య

by GSrikanth |
దారుణం.. నడిరోడ్డు మీద మద్రాస్ లాయర్ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్రాసు హైకోర్టు లాయర్‌ను కొందరు గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా నరికి చంపారు. బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లిన న్యాయవాది స్వామినాథన్ దంపతులను బైక్‌పై వచ్చిన దుండగులు ప్లాన్‌ ప్రకారం హత్య చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. పాతకక్షల కారణంగానే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

Advertisement

Next Story