అక్రమ సంబంధం పెట్టుకుందని భార్యను కడతేర్చిన భర్త

by Javid Pasha |
అక్రమ సంబంధం పెట్టుకుందని భార్యను కడతేర్చిన భర్త
X

దిశ, వెబ్ డెస్క్: వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ ప్రభుత్వ టీచర్ తన భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. చిత్తూరు డీఎస్పీ శ్రీనివాస మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లో కేంద్రంలోని విద్యా నగర్ కాలనీలో బాబు, హేమలత దంపతులు నివాసం ఉంటున్నారు. బాబు ఎస్ఆర్ పురంలోని గండ్లపల్లి పాఠశాలలో టీచర్ గా పని చేస్తుండగా భార్య హేమలత కూడా ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తోంది. పెళ్లయ్యాక కొంతకాలం పాటు సజావుగా సాగిన వారి కాపురంలో అనుమానం అనే పెనుభూతం వచ్చి చేరింది.

వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకున్నావంటూ భర్త బాబు తన భార్యతో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య శనివారం ఉదయం మరోసారి గొడవ జరిగింది. దీంతో భర్త బాబు తన భార్యపై దాడి చేసి ఇష్టమొచ్చినట్టుగా కొట్టాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన భార్యను చుట్టుపక్కల వాళ్లు గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed