స్నేహితుడే హంతకుడు

by Sridhar Babu |
స్నేహితుడే హంతకుడు
X

దిశ, మేడ్చల్ బ్యూరో : కీసర పోలీస్ స్టేషన్ పరిధి ఆర్జీకే కాలనీలో అనుమానా స్పద స్థితిలో మృతి చెందిన వ్యక్తిని అతడి స్నేహితుడే మద్యం మత్తులో హతమార్చినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కాప్రా, ఎల్లారెడ్డి గూడకు చెందిన మహిపాల్ యాదవ్, అహ్మద్ గూడ ఆర్జీకే కాలనీకి చెందిన పృథ్వి స్నేహితులు. కాగా పృథ్వి కుషాయిగూడకు చెందిన ఓ అమ్మాయిని ఐదేళ్లుగా ప్రేమిస్తున్నాడు. తన లవర్ విషయాన్ని స్నేహితుడైన మహిపాల్ యాదవ్ కు ఇటివలే తెలియజేశాడు. దీంతో పృథ్విని హేళన చేస్తూ ఆ అమ్మాయిని తాను ముందుగానే ప్రేమించానని మహిపాల్ తెలిపాడు.

దీంతో పృథ్వికి కోపం వచ్చింది. మహిపాల్ అన్న విషయాన్ని మనస్సులో పెట్టుకొని ఎలాగైనా హత మర్చాలనుకున్నాడు. ఈ నెల 11న పృథ్వి ఐదుగురు స్నేహితులతో కలిసి దమ్మాయిగూడలోని మద్యం సేవించారు. అనంతరం మహిపాల్ ను పని ఉందని హరిదాసుపల్లిలోని నిర్మాన్యుష ప్రాంతానికి తీసుకుని వచ్చి అక్కడ మద్యం సేవించారు. మద్యం మత్తులో పృథ్వి కత్తితో పొడిచి మహిపాల్ ను హతామర్చాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా, పృథ్వి తానే మహిపాల్ ను హత్య చేసినట్లు గురువారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చి లొంగిపోయినట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed