రైస్ మిల్లులో అగ్నిప్రమాదం

by Shiva |
రైస్ మిల్లులో అగ్నిప్రమాదం
X

దిశ, చేర్యాల : మున్సిపాలిటీ పరిధిలోని నటరాజ్ మోడ్రన్ బిన్ని రైస్ మిల్లులో శనివారం వెల్డింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ధాన్యం బస్తాలపై నిప్పురవ్వలు పడి మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు, పోలీసు సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా నిమిషాల్లో రైస్ మిల్లుకు చేరుకుని మంటలను అదుపు చేశారు. రైస్ మిల్లులో సుమారుగా 96,000 వేల టన్నుల ధాన్యం బస్తాలు ఉన్నాయని రైస్ మిల్లు యాజమని బాషెట్టి బుచ్చిరాములు గుప్త తెలిపారు. సుమారుగా రూ.80లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని యజమాని ఆయన తెలిపారు.

Advertisement

Next Story