కూతురిని కరిచిందని కుక్క పై కోపంతో రగిలిపోయిన తండ్రి.. ఏం చేశాడంటే!?

by Jakkula Mamatha |
కూతురిని కరిచిందని కుక్క పై కోపంతో రగిలిపోయిన తండ్రి.. ఏం చేశాడంటే!?
X

దిశ,వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లోని గుణాలో దారుణం చోటుచేసుకుంది. తన కూతురిపై దాడి చేసిందని ఓ వీధి కుక్క పై ఆమె తండ్రి అతి క్రూరంగా ప్రతీకారం తీర్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఓ బాలికను వీధి కుక్క కరిచింది. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ బాలిక తండ్రి ప్రతీకారంగా వీధి కుక్కను కర్రలతో విచక్షణారహితంగా కొట్టాడు. ఆపై దాని పై వేడి నిప్పులు చల్లాడు. అక్కడితో ఆగకుండా గాయపడిన కుక్కను బైక్ వెనుక తాళ్లతో కట్టి నయాపురా వీధుల్లో ఈడ్చుకెళ్లాడు. ఈ విధంగా వీధుల్లో తిప్పి తిప్పి చివరికి బండ రాయితో కొట్టి చంపాడు. ఇదంతా అక్కడి సీసీటీవీలో రికార్డయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అతడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

Next Story