కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

by Javid Pasha |
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని ఓ కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు కాగా లారీ ముందు భాగం దెబ్బతింది. ఇక ఈ ప్రమాదం పట్ల అక్కడి సీఎం సిద్ధరామయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు.

Advertisement

Next Story